జార్జ్‌ ఫ్లాయిడ్‌కు ఘన నివాళి  | Great Tribute To George Floyd | Sakshi
Sakshi News home page

జార్జ్‌ ఫ్లాయిడ్‌కు ఘన నివాళి 

Jun 10 2020 4:57 AM | Updated on Jun 10 2020 4:57 AM

Great Tribute To George Floyd - Sakshi

హ్యూస్టన్‌లోని ఓ చర్చిలో ఫ్లాయిడ్‌ పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న జనం 

హ్యూస్టన్‌: పోలీసు అధికారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ఫ్లాయిడ్‌కు సోమవారంవేలాది మంది అమెరికన్లు ఘన నివాళి అర్పించారు. హ్యూస్టన్‌లోని ఓ చర్చిలో మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా.. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు ఐదు వేల మంది ఫ్లాయిడ్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. సుమారు ఆరుగంటల పాటు మండే ఎండలనూ తట్టుకుని మద్దతుదారులు ఫ్లాయిడ్‌ శవపేటిక ముందు మౌనం దాల్చి శ్రద్ధాంజలి ఘటించారు. గత నెల 25న మినియాపోలిస్‌లో డెరెక్‌ ఛావిన్‌ అనే పోలీస్‌ అధికారి ఫ్లాయిడ్‌ మెడపై తన మోకాలిని ఉంచి అరెస్ట్‌ చేసే ప్రయత్నం చేయడం.. సుమారు ఎనిమిది నిమిషాల 46 సెకన్లపాటు మెడపై మోకాలు ఉండిపోవడంతో ఊపిరి ఆడక 46 ఏళ్ల ఫ్లాయిడ్‌ మృతి చెందడం తెల్సిందే. ఈ మరణం కాస్తా అమెరికాలో జాతి వివక్ష, పోలీస్‌ సంస్కరణల డిమాండ్లతో భారీ ఉద్యమానికి బీజం పడేలా చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement