ఊపిరాడకపోవడం వల్లే ఫ్లాయిడ్‌‌ మృతి: వైద్యులు

George Floyd Tested Positive for COVID 19 in April - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా పోలీసుల చేతిలో నరహత్యకు గురైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ పూర్తి శవపరీక్ష నివేదికను వైద్యులు బుధవారం విడుదల చేశారు. అనేక క్లినికల్ వివరాలను వెల్లడించిన ఈ నివేదిక ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేల్చింది. హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ కార్యాలయం విడుదల చేసిన ఈ 20 పేజీల నివేదిక జార్జ్‌ కుటుంబం అనుమతితో వెల్లడయ్యంది. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్‌ మాట్లాడుతూ.. ‘మెడపై తీవ్రమైన ఒత్తిడి వల్లే ఫ్లాయిడ్‌ మరణించాడు. అతడు మరణించిన తీరును బట్టి దీన్ని నరహత్యగా పేర్కొనవచ్చు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక ఏప్రిల్ 3న ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు, కాని లక్షణ రహితంగా ఉన్నాడని వెల్లడించారు. మరణించిన సమయంలో ఫ్లాయిడ్‌ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా కనిపించాయని తెలిపారు.(జార్జ్‌ది నరహత్యే !)

గతంలో అమెరికా పోలీసులు ఇచ్చిన నివేదికలో ఫ్లాయిడ్‌ ‘ఫెంటనిల్‌ ఇన్‌టాక్సికేషన్’‌, ‘మెథమ్‌ఫెటమైన్‌’ అనే డ్రగ్స్‌ తీసుకున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫెంటనిల్‌ ఇన్‌టాక్సికేషన్‌ వల్ల తీవ్రమైన శ్వాసకోశ మాంద్యం, మూర్ఛ లక్షణాలు ఉంటాయని.. కానీ ఫ్లాయిడ్‌లో ఇవేవి కనిపించలేదని నివేదికలో తెలిపారు. ఊపిరాడకపోవడం వల్లే ఫ్లాయిడ్‌‌ మరణించాడని ఆండ్రూ బేకర్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top