క్షణక్షణం.. మృత్యు వీక్షణం | Funerals Begin for 141 Slain in Taliban Attack on Pakistan School | Sakshi
Sakshi News home page

క్షణక్షణం.. మృత్యు వీక్షణం

Dec 17 2014 6:47 AM | Updated on Sep 2 2017 6:16 PM

క్షణక్షణం.. మృత్యు వీక్షణం

క్షణక్షణం.. మృత్యు వీక్షణం

ఏడుగురు మిలిటెంట్లు సైనిక దుస్తుల్లో పెషావర్ ఆర్మీ స్కూలు గేటు బద్దలు చేసుకుని దూసుకువచ్చారు.

స్కూల్లో నరమేధం సాగిన తీరిది..
 
10.30: ఏడుగురు మిలిటెంట్లు సైనిక దుస్తుల్లో పెషావర్ ఆర్మీ స్కూలు గేటు బద్దలు చేసుకుని దూసుకువచ్చారు. లోపలికి వస్తూనే విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించారు. అప్పుడు స్కూలు ఆడిటోరియంలో ఓ సమావేశం జరుగుతోంది. ముందుగా అక్కడున్న విద్యార్థులందరిపైనా కాల్పులు మొదలుపెట్టారు.
 
10.45:  మిగతా క్లాసుల్లో ఉన్న విద్యార్థులు కాల్పుల శబ్దాలు విని బయట ఏదో డ్రిల్ నడుస్తోందని భావించారు. అంతలోనే క్లాస్ బయట విద్యార్థులు ఒకరి తరువాత ఒకరు పడిపోవటం చూశారు. క్షణాల్లో పదుల సంఖ్యలో విదార్థులు విగతజీవులయ్యారు.
 
11.00: విద్యార్థులను వెనుక గేటు నుంచి తరలించే ప్రయత్నం.
 
11.20: భారీ ఎత్తున సైనిక బలగాల మోహరింపు.. దాదాపు 175 మంది జవానులు పాఠశాలలోకి ప్రవేశానికి ప్రయత్నం. 45 నిమిషాల పాటు ఉగ్రవాదులతో బయటి నుంచే కాల్పులు. కొందరు విద్యార్థులను నిర్బంధించిన ఉగ్రవాదులు.
 
12.55: గాయపడిన 35 మంది విద్యార్థులు ఆస్పత్రికి తరలింపు.
 
1.00: దాడి తమ పనేనంటూ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటన.
 
1.14: బరువెక్కిన హృదయంతో తమ పిల్లల కోసం స్కూల్ దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్న తల్లిదండ్రులు.
 
1.20: స్కూల్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఆత్మాహుతి మానవ బాంబులుగా తెహ్రీకే తాలిబాన్ ప్రతినిధి మొహమ్మద్ ఉమర్ ఖోరసాని వెల్లడి. చిన్నారులకు హాని తలపెట్టవద్దని, ఆర్మీ దళాలను లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశించినట్లు ప్రకటన. ఉత్తర వజీరిస్తాన్‌లో ఉగ్రవాదులపై ఆర్మీ దాడులకు ప్రతీకారంగానే దాడికి దిగినట్లు వెల్లడి.
 
1.37: స్కూల్ లోపల పెద్ద పేలుడు శబ్ధం. ఉన్నత తరగతుల విద్యార్థులున్న ఆడిటోరియం ముందు ఓ మానవ బాంబు తనను పెల్చుకున్నట్లు కథనాలు.
 
1.40: దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ప్రకటన.
 
1.50: 16 మంది విద్యార్థులు, ఓ టీచర్, ఓ జవాను మృతి చెందినట్లు లేడీ రీడింగ్ ఆస్పత్రి నుంచి విడుదలైన ప్రకటన. 40 మంది గాయాలతో బాధపడుతున్నట్లు వెల్లడి. గాయాలతో వచ్చి చేరుతున్న బాధితులు.
 
2.50: విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ఓ జవాను సహా మొత్తం 104 మంది మరణించినట్లు ఖైబర్ పఖ్తుంక్వా సీఎం పర్వేజ్ ఖట్టక్ వెల్లడి.
 
2.55: పెషావర్‌కు బయల్దేరిన ప్రధాని నవాజ్ షరీఫ్
 
7.15: దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 141కు చేరినట్లు, వీరిలో 132 మంది వరకు చిన్నారులేనని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నేత షిరీన్ మజారి ప్రకటన.
 
8.30: ఇలాంటి దాడులను నిషేధిస్తూ ఫత్వా జారీకి ఇస్లామిక్ స్కాలర్ల డిమాండ్
 
9.00: దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశస్థులు కారని, వారు అరబిక్‌లో మాట్లాడారని, ఉజ్బెక్‌లు అయి ఉంటారని పేర్కొంటూ ఖైబర్ పఖ్తుంక్వా హోంశాఖ ప్రకటన.
 
9.30: పెషావర్ పట్టణంలో పౌర సమాజం సభ్యులు కొవ్వొత్తులతో మృతులకు నివాళి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement