అయ్యా బాబోయ్‌.. ఈ స్టంట్‌ ఎ‍ప్పుడూ చూడలేదు

A French Stunt School Choreograph Hilarious Fight While Social Distancing - Sakshi

కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం అత్యవసరంగా మారింది. మహమ్మారి సోకకుండా ఉండేందుకు భౌతిక దూరం అవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక సోషల్‌ మీడియలోనూ సామాజిక దూరంపై అనేక ఫన్నీ వీడియోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఫ్రెంచ్‌కు చెందిన స్టంట్‌ స్కూల్‌ ఓ వినూత్నమైన వీడియోనే రూపొందించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్టంట్‌ స్కూల్‌ మూతపడటంతో.. ట్రైనింగ్‌ స్కూళ్లో శిక్షణ పొందుతున్న కొంతమంది ఇంట్లో నుంచే స్టంట్‌లు నేర్చుకుంటూ సామాజిక దూరం గురించి అవగాహన కల్పిస్తున్నారు. (ఐటీ కంపెనీల కొత్త నిబంధనలు )

ఒకరికొకరు గుద్దుకుంటున్నట్లు, తల బాదుకుంటున్నట్లు కనిపిస్తున్న ఈ సరదా వీడియోను సామాజిక దూరం నిబంధనలకు కట్టుబడి  రూపొందించారు. ఇందులో మొదట ఓ వ్యక్తి తన ఇంట్లో  కెమెరా ముందుకు వచ్చి ఎదుటి వ్యక్తిపై కిక్‌ ఇచ్చినట్లు చేయగా మరో వ్యక్తి కెమెరా నుంచి వెనక్కి ఎగిరి పడినట్లు నటిస్తారు. అలా ఒకరికొకరు గుద్దుకుంటూ ఈ వీడియో కొనసాగుతుంది. వీరు కొట్టుకోవడానికి అరటిపండు, బూట్లు, దిండ్లను సాధనాలుగా ఉపయోగించారు. ఫ్రెంచ్ పాఠశాల క్యాంపస్ యూనివర్స్ యూట్యూబ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోకు 13 మిలియన్ల వ్యూవ్స్‌ లభించాయి. లాక్‌డౌన్‌లో ఎన్నో చూశాము. కానీ, ఇలాంటి ఫైటింగ్‌ వీడియోను ఎప్పుడూ చూడలేదు. స్టంట్‌​ అదిరింది గురూ. ఇది మమ్మల్ని ఎంతో నవ్విస్తుంది’ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. (అద్భుతమైన వీడియో.. థాంక్యూ!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top