భారత్‌లో పత్రికాస్వేచ్ఛ దారుణం! | Freedom atrocity of press in India! | Sakshi
Sakshi News home page

భారత్‌లో పత్రికాస్వేచ్ఛ దారుణం!

Apr 21 2016 1:26 AM | Updated on Aug 15 2018 6:32 PM

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనా భారతదేశంలో పత్రికాస్వేచ్ఛ మరీ దారుణమని వెల్లడైంది. 180 దేశాల్లో జరిపిన వార్షిక సర్వేల్లో భారత్ 133వ స్థానంలో (గతేడాది 135) నిలిచింది.

133వ స్థానంలో భారత్.. పాక్‌కు 147

 వాషింగ్టన్: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనా భారతదేశంలో పత్రికాస్వేచ్ఛ మరీ దారుణమని వెల్లడైంది. 180 దేశాల్లో జరిపిన వార్షిక సర్వేల్లో భారత్ 133వ స్థానంలో (గతేడాది 135) నిలిచింది. జర్నలిస్టులకు వస్తున్న బెదిరింపులు, వారిపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రధాని  మోదీ ఉదాసీనంగా ఉన్నారని సూచీలు తెలుపుతున్నాయి. జర్నలిస్టులు, బ్లాగర్ల భద్రత ఆధారంగా ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థ విడుదల చేసిన ఈ వివరాల ప్రకారం.. ఫిన్లాంండ్ వరుసగా ఆరో ఏడాదీ మొదటి స్థానంలో నిలిచింది. పాక్ 147, చైనా 176వ స్థానంలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement