కిమ్ హత్య.. మహిళ పరుగు అందుకే! | Female Suspects in Kim Jong-Nam Killing Knew it was Poison Attack | Sakshi
Sakshi News home page

కిమ్ హత్య.. మహిళ పరుగు అందుకే!

Feb 22 2017 11:37 AM | Updated on Jul 29 2019 5:39 PM

కిమ్ హత్య.. మహిళ పరుగు అందుకే! - Sakshi

కిమ్ హత్య.. మహిళ పరుగు అందుకే!

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరుడు కిమ్ జోంగ్ నామ్ హత్యకు సంబంధించి ఇద్దరు మహిళలను మలేసియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కౌలాలంపూర్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరుడు కిమ్ జోంగ్ నామ్ హత్యకు సంబంధించి ఇద్దరు మహిళలను మలేసియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో మకావు వెల్లడానికి సిద్ధంగా ఉన్న కిమ్పై ఇటీవల విషప్రయోగం వీడియో దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో కనిపించాయి. కిమ్పై విషప్రయోగం చేసిన యువతి.. వేగంగా బాత్ రూం వైపు పరిగెత్తడం వీడియోల్లో కనిపించింది.

ఇదే విషయమై విలేకరులు మలేసియా పోలీస్ చీఫ్ అబు బాకర్ను ప్రశ్నించారు. మహిళలు ఉద్దేశపూర్వకంగానే కిమ్పై విషప్రయోగం చేశారా? చేతిలో ఉన్నది విషం అన్న విషయం ఆ మహిళకు తెలుసా.. అని ఓ విలేకరి అబూబకర్ను ప్రశ్నించగా.. 'మీరు ఆ వీడియో చూసి ఉంటారు. విషప్రయోగం తరువాత చేతులను దూరంగా ఉంచుతూ మహిళ బాత్ రూం వైపు పరిగెత్తింది. అంటే ఆ విషాన్ని వెంటనే కడిగేసుకోవాలనే విషయం ఆ యువతికి స్పష్టంగా తెలుసు. అందుకే అలా పరిగెత్తింది' అని వ్యాఖ్యానించారు. కిమ్ హత్యలో మహిళలు ఉద్దేశపూర్వకంగానే పాల్గొన్నారని ఇది తెలుపుతుందన్నారు. నామ్ హత్య వెనుకాల సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిమ్పై ప్రయోగించిన విషం ఏంటనేది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement