‘ద్వేషపూరిత దాడుల్లో సిక్కులు’

FBI Report Shows That Sikh Religion Is In Third Place In US Hate Crime - Sakshi

అమెరికాలో 2018లో జరిగిన ద్వేషపూరిత దాడుల్లో బాధితులుగా సిక్కులు మూడో స్థానంలో ఉన్నారని యుఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం సిక్కులపై 60 దాడులు చోటు చేసుకున్నాయని పేర్కొంది. గత ఏడాది అమెరికాలో మొత్తం ద్వేషపూరితమైన దాడులు 7,120 జరిగాయని.. 2017తో పోల్చతే కొంచం తగ్గాయిని ఎఫ్‌బీఐ నివేదిక తెలిపింది. ద్వేషపూరితమైన దాడులు ముఖ్యంగా మతం ఆధారంగా యూదులు(835), ముస్లింలు(188), సిక్కులు (60)పై జరిగాయని పేర్కొంది. ఇతర మతాలపై ఇటువంటి దాడులు 91 అయ్యాయని తెలిపింది. ఇందులో భాగంగా హిందువులపై 12 దాడులు, బుద్ధులపై పది చోటుచేసుకున్నట్టు వెల్లడించింది. 

జాతి అధారంగా మొత్తం 4,047 దాడులు జరిగితే.. అందులో అత్యధికంగా అమెరికాలోని నల్లజాతి అఫ్రికన్లపై సుమారు 1,943 దాడులు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించింది. తరువాత తెల్ల జాతివారైన అమెరికన్లపై కూడా 762 దాడులు.. లాటిన్లపై 485 దాడులు జరిగాయని ఆ నివేదికలో వెల్లడైంది. కాగా 2018లో ఆసియన్లపై 148, అరబ్బులపై 82, అలాస్కా ప్రజలపై 194 ద్వేషపూరిత దాడులు జరిగినట్టు ఎఫ్‌బీఐ నివేదిక వెల్లడించింది. అయితే మిగతా మతస్తులపై దాడులు సాధారణ స్థాయిలో  ఉన్నప్పటికీ సిక్కులపై మాత్రం పెరుగుతున్నాయని.. దుండగులు దాడులకు లక్ష్యం చేసుకున్న మతాల్లో సిక్కులు మూడో స్థానంలో ఉన్నారని ఎఫ్‌బీఐ నివేదిక వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top