గూగుల్‌ క్రోమ్‌ వాడుతున్నారా.. ఇవి తెలుసుకోవాల్సిందే

Every User Should Know Google Chrome Five Interesting Features - Sakshi

మీరు గూగుల్‌ క్రోమ్‌ను వాడుతున్నారా .. అయితే కచ్చితంగా ఈ వార్తను చదవాల్సిందే. ప్రస్తుత నెట్‌ ప్రపంచంలో ప్రతి ఒక్కరు గూగుల్‌ క్రోమ్‌ను విరివిగా వాడుతున్న సంగతి అందరికి తెలిసిందే. మరి అలాంటి గూగుల్‌ క్రోమ్‌లో ఇటివలే కొన్ని కొత్త ఫ్యూచర్స్‌ వచ్చి చేరాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 

►గెస్ట్చర్‌ నావిగేషన్‌ : వినియోగదారులు క్రోమ్‌ను వాడే సమయంలో ఒక వెబ్ పేజీ నుంచి మరొక వెబ్‌పేజ్‌కు వెళ్లేందుకు క్రోమ్‌లో ఒక గెస్ట్చర్‌(నావిగేటర్‌)ను ప్రవేశపెట్టింది. దీనిని యాక్టివేట్‌ చేయాలంటే మీ యూఆర్‌ఎల్‌ బార్‌లో 'క్రోమ్‌ ://ఫ్లాగ్స్‌/# ఓవర్‌ స్క్రోల్‌-హిస్టరీ-నావిగేషన్‌'ను టైప్ చేయాలి. 

►గూగుల్ ఓమ్నిబాక్స్ : ఈ ఆప్షన్‌ క్రోమ్‌లో ఉంటుందని సాధారణంగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ క్రోమ్‌లోని అడ్రస్ బార్‌లో  సాధారణంగా యూఆర్‌ఎల్‌ ఉండేదానినే గూగుల్ ఓమ్నిబాక్స్ అంటారు. ఇది నేరుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు అనుసంధానమై ఉంటుంది. ఓమ్నిబాక్స్‌లో టైప్‌ చేసే విషయాలను గూగుల్ నేరుగా తీసుకుంటుందని వినియోగదారులు గమనించాలి.

రికవరింగ్‌ లాస్ట్‌ టాబ్స్‌ : మీరు ఎప్పుడైనా పొరపాటుగా మీ ట్యాబ్‌లను క్లోజ్‌ చేస్తే పేజ్‌ రీలోడ్‌ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేస్తారు.. అలా కుదరకపోతే మళ్లీ కొత్తగా పేజ్‌ ఓపెన్‌ చేయాల్సిందే.  ఇక మీదట అలా చేయకుండా క్రోమ్ ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీరు చేయాల్సిందల్లా  విండోస్‌లో 'కంట్రోల్ + షిఫ్ట్ + టి' నొక్కగానే మీరు ఇంతకు ముందు వాడిన పేజ్‌కు యాక్సెస్‌ అవుతుంది. 

డార్క్ మోడ్  : గూగుల్ క్రోమ్‌లో డార్క్ మోడ్ అనే ఆప్షన్‌ 2019 లోనే ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్ధేశం కళ్ళపై ఒత్తిడి ఏర్పడకుండా ఓఎల్‌ఈడీ రూపంలో ఉంటుంది. దీనిని సెలెక్ట్‌ చేసుకోవాలంటే 'విండోస్‌>సెట్టింగ్స్‌> అప్పియరెన్స్‌'అనే ఆప్షన్‌కు వెళ్లి థీమ్‌ను 'మెటీరియల్ ఇగ్నిటో డార్క్‌' ఎంచుకోవాలి. అయితే ఈ డార్క్‌మోడ్‌ ఆప్షన్‌ అనేది మాక్‌ ఓఎస్‌ 10.14, విండోస్‌ 10 వర్షెన్‌లలో మాత్రమే పనిచేస్తుంది.

మ్యూటింగ్ సైట్స్‌ : అప్పుడప్పుడు బ్రౌజింగ్  చేస్తున్న సమయంలో  పాపప్‌ యాడ్స వస్తూ చికాకు తెప్పిస్తుంటాయి. అయితే పాపప్‌ను ఆపేందుకు కొత్తగా గూగుల్‌ క్రోమ్‌లో మ్యూట్‌ సైట్‌ అనే ఆప్షన్‌ వచ్చి చేరింది.ఆడియో ప్లే అవుతున్న సమయంలో టాబ్‌పై కుడివైపు క్లిక్ చేసి మ్యూట్ సైట్ క్లిక్ చేస్తే పాప్‌అప్‌ యాడ్స్‌ ఇక కనిపించవు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top