
ఆ సైట్‌ను హ్యాక్ చేస్తే 1,50,000 డాలర్లు
అమెరికా రక్షణ శాఖ (డీవోడి) తన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో పరీక్షించాలనుకుంటోంది. దీని కోసం హ్యాకర్లను ఆహ్వానిస్తోంది.
అమెరికా సామాజిక భద్రత నెంబర్ ఉన్న హ్యాకర్లు మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలని, వారి నేర చరితను పరిశీలించేందుకు కూడా అంగీకరించాలని షరతు విధించారు. తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలను కనుగొనేందుకు ఫేస్‌బుక్, గూగుల్ లాంటి సంస్థలు కూడా ఇలాంటి బగ్ బౌంటీ పోటీలను నిర్వహించాయి. ఇటీవల ఊబర్ సంస్థ కూడా తమ టాక్స్ యాప్‌లో లోపాలను కనుగొనేందుకు ఇలాంటి పోటీనే ఆహ్వానించి పదివేల డాలర్ల రివార్డును ప్రకటించింది.