గులాబీ మొక్కలో కరెంట్‌ నిల్వ | Sakshi
Sakshi News home page

గులాబీ మొక్కలో కరెంట్‌ నిల్వ

Published Wed, Mar 1 2017 2:28 AM

గులాబీ మొక్కలో కరెంట్‌ నిల్వ - Sakshi

లండన్ : గులాబీ మొక్కను విద్యుత్‌ను నిల్వ చేసే సూపర్‌కెపాసిటర్‌గా మలచడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. రానున్న కాలంలో ఎలక్ట్రానిక్‌ పరికరాలకు ఈ గులాబీ మొక్క నుంచే విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని వారు తెలిపారు.

దీనికోసం పరిశోధకులు గులాబీ మొక్కలో పాలీమర్‌ ద్రావణాన్ని ప్రవేశపెట్టడంతో మొక్క కాండంలో ఏర్పడిన హైడ్రోజెల్‌ తీగలుగా మారిందని పేర్కొన్నారు. దీంతో తీగలకు ఇరు వైపులా ఎలక్ట్రోడ్‌లు, మధ్యలో ట్రాన్సిస్టర్‌ మాదిరిగా ఏర్పడ్డాయని చెప్పారు. తర్వాత మొక్కలో విద్యుత్‌ను నిల్వ చేయడంలో అనేకసార్లు విజయం సాధించామని స్వీడన్ లోని లింకోపింగ్‌ వర్సిటీకి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎలేని స్ట్రావిన్ డో తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement