ప్రజామద్దతుతో పోర్టు భూసేకరణ | Collection of land with public support | Sakshi
Sakshi News home page

ప్రజామద్దతుతో పోర్టు భూసేకరణ

Nov 20 2016 1:44 AM | Updated on Sep 4 2017 8:33 PM

ప్రజామద్దతుతో పోర్టు భూసేకరణ

ప్రజామద్దతుతో పోర్టు భూసేకరణ

భావనపాడు తీర ప్రాంతంలో పోర్టు ఏర్పాటుకు సంబంధించి ప్రజా మద్దతుతో పూర్తి స్థారుులో భూసేకరణ చేస్తామని జారుుంట్ కలెక్టర్ కె.వి.ఎస్.చక్రధర్‌బాబు తెలిపారు.

జేసీ కె.వి.ఎస్.చక్రధర్‌బాబు
టెక్కలి: భావనపాడు తీర ప్రాంతంలో పోర్టు ఏర్పాటుకు సంబంధించి  ప్రజా మద్దతుతో పూర్తి స్థారుులో భూసేకరణ చేస్తామని జారుుంట్ కలెక్టర్ కె.వి.ఎస్.చక్రధర్‌బాబు తెలిపారు. జేసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా డివిజన్ కేంద్రమైన టెక్కలిలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా జేసీని ఆర్డీఓ ఎ.వెంకటేశ్వరరావు, తహశీల్దార్ అప్పలరాజు, రెవెన్యూ సిబ్బంది మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం ఆర్డీఓ, తహశీల్దార్‌తో డివిజన్‌లో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పోర్టు ప్రభావిత ప్రాంత ప్రజలకు పరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. టెక్కలిలో త్వరితగతిన రైతు బజారు ఏర్పాటు చేయాలన్నారు. పల్స్ సర్వేలో భాగంగా టెక్కలి డివిజన్ వెనుకబడి ఉందని, ఈ నెల 25 లోగా పల్స్ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

అవసరమైతే వలస వెళ్లిన వారిని వెనక్కి రప్పించి సర్వేను పూర్తి చేయాలన్నారు. సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం జేసీ విలేకర్లతో మాట్లాడుతూ డివిజన్‌పై అవగాహన కోసం పర్యటిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వారికి అవసరమైన మేరకు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జేసీ తెలిపారు. అనంతరం పెద్ద నోట్లు రద్దు ప్రభావంపై స్థానిక వ్యాపారులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఐకేపీ ద్వారా నిత్యావసర దుకాణాలు ఏర్పాటు చేసి బ్యాంకు ఏటీఎం కార్డును స్వైప్‌గా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నగదు రహితంగా ధాన్యం కొనుగోలు
రాజాంరూరల్: ధాన్యం కొనుగోలులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, నగదు రహిత విధానాలు అమలు చేయాలని జారుుంట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు ఆదేశించారు. స్థానిక మార్కెట్ కమిటి ఆవరణలో శనివారం ధాన్యం మద్దతు ధర- కొనుగోలుపై డివిజన్ స్థారుు అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై  రైతుల్లో అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలో ఈ ఏడాది 147 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, పాలకొండ డివిజన్‌లో 51 కేంద్రాలను గుర్తించామన్నారు. ఈ కేంద్రాల ద్వారా 10లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. దళారీ వ్యవస్థ నిర్మూలన, మద్దతు ధర కల్పన, తూనికలు మోసాలు నివారణ, తేమ శాతం నిర్ధారణ వంటి లంశాలలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించి అందించాలని కోరారు.

 పీఏసీఎస్, వెలుగు, ఏఎంసీ, డీసీఎంసీ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించడంతోనే లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. గత ఏడాది తప్పిదాలు ఈ ఏడాది పునరావృతం అవ్వకుండా కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు చేర్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది కేవలం 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని సుమారు రూ.900 కోట్లు రైతులకు చెల్లింపులు జరిగిందన్నారు. ఈ ఏడాది పూర్తిగా చెల్లింపులు నగదు రహితంగా చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. రేషన్ డీలర్లను గ్రామాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లుగా నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనికి అవసరమైన 2500 పీఓసీ మిషన్లు అందించమని బ్యాంకర్లను కోరామన్నారు. అంతకుముందు పౌరసరఫాల సంస్థ మేనేజర్ జయరాం ధాన్యం కొనుగోలుకు సంబంధించి  సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement