ఆక్సిజన్‌ లేకుండా ఎవరెస్టు పైకి.. | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్‌ లేకుండా ఎవరెస్టు పైకి..

Published Sun, Jun 4 2017 2:14 AM

ఆక్సిజన్‌ లేకుండా ఎవరెస్టు పైకి..

కఠ్మాండు: ఎవరెస్టు అధిరోహణలో అరుదైన అద్భుతం ఆవిష్కృతమైంది. భారత ఆర్మీకి చెందిన నలుగురు సభ్యులు ఆక్సిజన్‌ సిలిం డర్లను వినియోగించకుండా విజయవంతంగా ఎవరెస్టును అధిరోహించారు.

ఆక్సిజన్‌ సిలిం డర్లను వినియోగించకుండా ఎవరెస్టును అధిరో హించిన తొలి బృందంగా చరిత్రను సృష్టించారు. ఎవరెస్టును అధిరోహించిన బృందంలో కున్‌చోక్‌ టెండా, కెల్సాంగ్‌ డోర్జీ భూటియా, కాల్డెన్‌ పంజ ర్, సోనమ్‌ ఫంత్సోక్‌లు ఉన్నారు. మొత్తం 14 మంది సభ్యులుగల బృందంలో ఆక్సిజన్‌ లేకుండా అధిరోహించిన వారు ఈ నలుగురు కాగా, మిగిలిన వారిలో అర్జీన్‌ తోప్‌గే, గ్వాంగ్‌ గెల్‌క్, కర్మ జోపాలు ఆక్సిజన్‌ సిలిండర్లను విని యోగిస్తూ ఎవరెస్టును అధిరోహించగలిగారు.

Advertisement
Advertisement