చైనా ఆర్థిక వ్యవస్థకు 6.8 శాతం నష్టం

China Economy Shrinks 6.8 Percent Due To Coronavirus - Sakshi

బీజింగ్‌ : చైనాలో కరోనా వైరస్‌ కారణంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఆర్థిక వ్యవస్థకు గతేడాదితో పోలిస్తే జీడీపీలో 6.8 శాతం నష్టం వాటిల్లింది. మార్చి నెల నాటికి త్రైమాసిక ఫలితాలు వెలువడడంతో ఈ నష్టం వివరాలు స్పష్టమయ్యాయని అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. దేశంలో మార్కెట్‌ తరహా ఎకానమీ విధానాలు ప్రవేశపెట్టిన 1979 సంవత్సరం నుంచి ఇంతటి నష్టం వాటిల్లడం ఇదే మొదటి సారి. దేశంలోని వుహాన్‌ పట్టణంలో ఉద్భవించిన కరోనా వైరస్‌ కట్టడికి చైనా అంతట లాక్‌డౌన్‌ ప్రకటించడం, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, మాల్స్,మార్కెట్లను మూసివేసిన విషయం తెలిసిందే. (భార్యలను వేధించే భర్తలకు షాక్‌..)

దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టాన్ని ముందే ఊహించిన చైనా, ఒక్క వుహాన్‌లో మినహా మార్చి నెలలోనే లాక్‌డౌన్‌ ను పూర్తిగా ఎత్తివేసింది. దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మూడో వారం లేదా నాలుగోవారంలో కోలుకుంటుందని భావిస్తున్నట్లు బీజీంగ్‌లోని రుషి ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఝూ జెక్‌క్సిన్‌ తెలిపారు.దీంతో పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలు చిగురించడంతో ఈ రోజు ఆసియా స్టాక్‌ మార్కెట్‌ లాభాల దిశగా దూసుకుపోయింది. చైనా రిటేల్‌ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 19 శాతం పడిపోగా, ఎప్పుడూ వద్ధి రేటును మూటగట్టుకునే ఫ్యాక్టరీల్లో పెట్టుబడులు, రియల్‌ ఎస్టేట్, ఫిక్స్‌›్డలతో కూడిన ప్రధాన రంగం 16.1 శాతం పడి పోయింది. మరో పక్క పర్యాటక రంగం కూడా దెబ్బతిన్నది. సినిమాలు, హేర్‌ సాలూన్లు, ఇతర వినోద కార్యకలాపాలు ఇప్పటికీ నిలిచిపోయే ఉన్నాయి. చైనాలో మొత్తం కరోనా వైరస్‌ బారిన 82,367 మంది పడగా, 3,342 మంది మరణించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top