అమెరికా అధ్యక్షుడు.. సాధారణ కస్టమర్..! | Barack Obama Drop-In For Pork Soup Stuns Vietnam Street Shop Owner | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్షుడు.. సాధారణ కస్టమర్..!

May 24 2016 4:38 PM | Updated on Sep 4 2017 12:50 AM

అమెరికా అధ్యక్షుడు.. సాధారణ కస్టమర్..!

అమెరికా అధ్యక్షుడు.. సాధారణ కస్టమర్..!

అమెరికా అధ్యక్షుడు అనగానే మొదట గుర్తొచ్చేది వైట్ హౌస్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వాయ్య దేశానికి అధినేత.

హనాయ్: అమెరికా అధ్యక్షుడు అనగానే మొదట గుర్తొచ్చేది వైట్ హౌస్. ఆయన చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్. పటిష్టమైన భద్రత వలయం అమెరికా అధ్యక్షుడికి ఎప్పుడూ ఉంటుంది.  ప్రపంచ దేశాలపై అధిపత్యం కోసం ఎప్పుడూ తాపత్రయపడే దేశం అమెరికా. అలాంటి దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా సామాన్య వ్యక్తిగా వ్యవహరించి ఓ షాప్ ఓనర్ కు షాక్ ఇచ్చారు. సోమవారం రాత్రి వియత్నాం వచ్చిన ఒబామా అక్కడ ఓ షాపులోకి వెళ్లారు. సాధారణ కస్టమర్ గా ప్లాస్టిక్ కుర్చీని లాక్కుని కూర్చుని ఓ వంటకాన్ని ఆర్డర్ చేశారు. ప్రతిరోజూ ఎన్నో న్యూడిల్ సూప్స్ ను షాప్ ఓనర్ నుయెన్ థైలీన్ విక్రయించి ఉండొచ్చు.. కానీ సోమవారం మాత్రం ఆమెకు చాలా స్పెషల్. ఎందుకుంటే ఒబామా తన షాపుకు విచ్చేసి వియత్నాం స్పెషల్ ఐటమ్ న్యూడుల్స్ సూప్ 'బన్ చా' ఐటమ్ ఆర్డర్ చేయడంతో ఆమె ఆశ్చర్యపోయింది.

 ఆంథోని బుర్డేన్ అనే హెడ్ కుక్ తో కలసి వంటకాన్ని ఆస్వాదించారు. ఒబామా తనకు ఆరు డాలర్ల చెక్ ఇచ్చారని చెప్పాడు. అధ్యక్షుడితో కలిసి ఉన్నప్పుడు దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్లాస్టిక్ స్టూల్, చీప్ కానీ రుచికరమైన న్యూడుల్స్, చల్లటి బీర్ అంటూ ట్వీట్ చేశాడు.  ఒబామా తన షాపులో సమయాన్ని వెచ్చించడం, వంటకాన్ని తినడంతో మా కుటుంబం మొత్తానికి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమని చెప్పింది. అయితే ఒబామా అక్కడికి వచ్చాడన్న కొన్ని నిమిషాల్లోనే అక్కడ సందడి వాతావరణం కనిపించింది. షాపు నుంచి తిరిగి వెళ్లడానికి అధ్యక్షుడు బయటకు రాగానే వియత్నాం వాసులు ఆయనను తమ కెమెరాలో బంధించడానికి పోటీ పడ్డట్టుగా ఎగబడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement