breaking news
Anthony Bourdain
-
ప్రముఖ చెఫ్ ఆత్మహత్య
పారిస్ : ప్రముఖ చెఫ్ ఆంథోని బుర్డేన్ పారిస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఓ కార్యక్రమ షూటింగ్ కోసం పారిస్‌కు వెళ్లిన ఆంథోని శుక్రవారం హోటల్లోని తన గది ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అమెరికాకు చెందిన ఆంథోని వంటల తయారీలో, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సాధారణ జనాలే కాకుండా పలువురు ప్రముఖులు కూడా ఆంథోని వంటకాలను అమితంగా ఇష్టపడుతారు. ప్రస్తుతం ఆంథోని ప్రముఖ న్యూస్ చానల్ సీఎన్ఎన్ నిర్వహిస్తున్న పార్ట్స్ అన్నోన్ వంటల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని వంటకాలను ఈ కార్యక్రమంలో పరిచయం చేస్తున్నారు. ఈ షో చిత్రీకరణ కోసం పారిస్ వెళ్లిన ఆంథోని హోటల్లో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆంథోని మరణంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆంథోని తినని ఆహారం అంటూ ఏదీ లేదు. ప్రపంచంలోని దాదాపు అన్ని రకాల వంటకాలను రుచి చూసిన వ్యక్తిగా రికార్డ్ నెలకొల్పారు. రుచికరమైన ఆహారంతోపాటు.. చెత్త ఫుడ్ కూడా తిన్న వ్యక్తిని నేనే అంటారు ఆయన. కొద్ది రోజుల ముందే పార్ట్స్ అన్నోన్కు సంబంధించి హౌస్ ఆఫ్ రైజింగ్ సన్ పేరుతో ఓ పాటను విడుదల చేశారు. దీనికి విశేష స్పందన వచ్చింది. ఆంథోని వంటలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అతడు వంటలపై పుస్తకాలు రాయడంతో పాటు పలు టీవీ షోలు నిర్వహించారు. రెస్టారెంట్లో పనిచేస్తున్న సిబ్బంది భద్రత కోసం కూడా ఆయన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సీఎన్ఎన్లో ఆంథోని నిర్వహిస్తున్న పార్ట్ అన్నోన్ 2013లో ప్రముఖ పీబాడీ అవార్డు సొంతం చేసుకుంది. -
అమెరికా అధ్యక్షుడు.. సాధారణ కస్టమర్..!
హనాయ్: అమెరికా అధ్యక్షుడు అనగానే మొదట గుర్తొచ్చేది వైట్ హౌస్. ఆయన చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్. పటిష్టమైన భద్రత వలయం అమెరికా అధ్యక్షుడికి ఎప్పుడూ ఉంటుంది. ప్రపంచ దేశాలపై అధిపత్యం కోసం ఎప్పుడూ తాపత్రయపడే దేశం అమెరికా. అలాంటి దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా సామాన్య వ్యక్తిగా వ్యవహరించి ఓ షాప్ ఓనర్ కు షాక్ ఇచ్చారు. సోమవారం రాత్రి వియత్నాం వచ్చిన ఒబామా అక్కడ ఓ షాపులోకి వెళ్లారు. సాధారణ కస్టమర్ గా ప్లాస్టిక్ కుర్చీని లాక్కుని కూర్చుని ఓ వంటకాన్ని ఆర్డర్ చేశారు. ప్రతిరోజూ ఎన్నో న్యూడిల్ సూప్స్ ను షాప్ ఓనర్ నుయెన్ థైలీన్ విక్రయించి ఉండొచ్చు.. కానీ సోమవారం మాత్రం ఆమెకు చాలా స్పెషల్. ఎందుకుంటే ఒబామా తన షాపుకు విచ్చేసి వియత్నాం స్పెషల్ ఐటమ్ న్యూడుల్స్ సూప్ 'బన్ చా' ఐటమ్ ఆర్డర్ చేయడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఆంథోని బుర్డేన్ అనే హెడ్ కుక్ తో కలసి వంటకాన్ని ఆస్వాదించారు. ఒబామా తనకు ఆరు డాలర్ల చెక్ ఇచ్చారని చెప్పాడు. అధ్యక్షుడితో కలిసి ఉన్నప్పుడు దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్లాస్టిక్ స్టూల్, చీప్ కానీ రుచికరమైన న్యూడుల్స్, చల్లటి బీర్ అంటూ ట్వీట్ చేశాడు. ఒబామా తన షాపులో సమయాన్ని వెచ్చించడం, వంటకాన్ని తినడంతో మా కుటుంబం మొత్తానికి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమని చెప్పింది. అయితే ఒబామా అక్కడికి వచ్చాడన్న కొన్ని నిమిషాల్లోనే అక్కడ సందడి వాతావరణం కనిపించింది. షాపు నుంచి తిరిగి వెళ్లడానికి అధ్యక్షుడు బయటకు రాగానే వియత్నాం వాసులు ఆయనను తమ కెమెరాలో బంధించడానికి పోటీ పడ్డట్టుగా ఎగబడ్డారు. Low plastic stool, cheap but delicious noodles, cold Hanoi beer. pic.twitter.com/KgC3VIEPQr — Anthony Bourdain (@Bourdain) 23 May 2016