ఆస్ట్రేలియాలో తల్లిదండ్రుల దారుణం | Australian parents jailed for sexually abusing daughter for 15 years | Sakshi
Sakshi News home page

ఇదొక తండ్రి దారుణం.. మాతృత్వానికి మచ్చ

Oct 28 2016 1:30 PM | Updated on Jul 28 2018 8:40 PM

ఆస్ట్రేలియాలో తల్లిదండ్రుల దారుణం - Sakshi

ఆస్ట్రేలియాలో తల్లిదండ్రుల దారుణం

ఇదొక సభ్య సమాజం తలదించుకునే ఘటన. కంటికి కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపాలన్నంత ఆగ్రహం తెప్పించే దుర్మార్గం. కన్నతండ్రి కామాంధుడిగా మారగా అతడికి ఎలా సహకరించాలో చెబుతూ మాతృత్వానికి తీరని మచ్చ తెచ్చిన ఓ పైశాచిక తల్లి దౌర్భాగ్య ప్రవర్తన.

సిడ్నీ: ఇదొక సభ్య సమాజం తలదించుకునే ఘటన. కంటికి కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపాలన్నంత ఆగ్రహం తెప్పించే దుర్మార్గం. కన్నతండ్రి కామాంధుడిగా మారగా అతడికి ఎలా సహకరించాలో చెబుతూ మాతృత్వానికి తీరని మచ్చ తెచ్చిన ఓ పైశాచిక తల్లి దౌర్భాగ్య ప్రవర్తన. అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కూతురుకి ఐదేళ్ల ప్రాయం నుంచే నరకం చూపించడం మొదలుపెట్టి ఆస్ట్రేలియాలో ఓ తల్లిదండ్రులు దుర్మార్గానికి పాల్పడ్డారు. పది హేనేళ్లుగా తండ్రి ఆ బిడ్డను చిత్ర హింసలకు గురి చేస్తూ లైంగిక దాడికి పాల్పడగా అలాంటి చర్యను ప్రతిఘటించాల్సిన తల్లి అతడికి సహకరించింది.

కూతురుని ఇష్టమొచ్చినట్లు కొడుతూ అతడికి సహకరించాలంటూ చిత్రవద చేసింది. ఆ బాధిత యువతికి ఇప్పుడు 24 ఏళ్లు. ఎట్టకేలకు ఆ కసాయి తల్లిదండ్రులు జైలు పాలయ్యారు. అతడికి 48 ఏళ్ల జైలు శిక్ష విధించగా ఆమెకు 16 ఏళ్ల జైలు శిక్ష, 11 ఏళ్ల సామాజిక సేవను శిక్షగా విధించారు. వివరాల్లోకి వెళితే, ఆస్ట్రేలియాలో ఓ 59 ఏళ్ల వ్యక్తి, 51 ఏళ్ల మహిళ భార్య భర్తలుగా ఉన్నారు. వారికి ఒక కూతురు ఉంది. ఆ కూతురుకి ఐదేళ్లు వచ్చాక తీసుకెళ్లి వారి ఇంటి ఎదురుగా ఉన్న షెడ్డులో కట్టిపడేశారు. అనంతరం తమ దుశ్చర్యలు మొదలు పెట్టారు. అలా పది హేనేళ్లపాటు ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఈ క్రమంలో పదునైన వస్తువులు ఆ బాలిక శరీరంపై గుచ్చుతూ చిత్రవద చేశారు. మిరపకాయలు తినిపించారు. తాము చెప్పినట్లు చేయకుంటే గొంతు తెగకోస్తామంటూ చిన్న సైజు రంపపు బ్లేడుతో గాయాలు చేశారు. ప్రస్తుతం మానసిక వైద్యాలయంలో చికిత్స పొందుతున్న ఆ బాధిత యువతి 2011లో తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రెండేళ్లపాటు విచారణ చేసి 2013లో వారిని అరెస్టు చేయగా వారికి శుక్రవారం కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఆ తండ్రి 73 నేరాలకు పాల్పడగా ఆమె మొత్తం 13 నేరాలకు పాల్పడినట్లు కోర్టు నిర్దారించింది. వారు చేసిన చర్యలపట్ల సిడ్నీ కోర్టు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement