వైరల్‌ వీడియో : ‘నీకు దొంగతనం చేతకాదులే..!’

Aurora Police Share E-Cigarette Store Robbery Attempt Video - Sakshi

డెన్వర్ : దొంగతనానికి వచ్చే వాడు ఎవరూ గుర్తు పట్టకుడా ఉండేలా ముఖానికి మాస్క్‌ వేసుకుని.. బెదిరించడానికి ఆయుధాలు తీసుకోని వస్తాడు. చూడ్డానికి గుండేలు తీసిన బంటులా ఉంటాడు. కానీ, ఇప్పుడు మేము చెప్పబోయే దొంగ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. ఈ దొంగ చేసిన పనిని చూస్తే భయపడడం కంటే ముందు పడి పడి నవ్వుతారు.  ఎందుకంటే దోపిడీకి వచ్చిన ఈ దొంగ ఏమాత్రం జాగ్రత్త లేకుండా బెదిరించడానికి తెచ్చుకున్న గన్‌నే పారేసుకుని.. చివరికి అవతలి వారికి చిక్కకుండా కాలికి బుద్ధి చెప్పి పరారయ్యాడు. కొలరెడోలో చోటుచేసుకున్న ఈ వెరైటీ దొంగతనం వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

వీడియోలో ఉన్న దాని ప్రకారం సదరు దొంగ కొలరెడోలోని ఓ ఈ-సిగరెట్‌ దుకాణంలో చోరి చేయడానికి వచ్చాడు. అక్కడ ఓ మహిళా ఉద్యోగి పనిచేస్తుంది. దాంతో ఈ దొంగ వెంటనే గన్‌ తీసి మహిళా ఉద్యోగిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలనుకున్నాడు. కానీ అతని ప్లాన్‌ వర్క్‌వుట్‌ కాలేదు . తుపాకీ తీస్తూ ఉండగా అది కాస్తా జారి కౌంటర్‌లో పడిపోయింది. ఇది గమనించిన మహిళ కౌంటర్‌లో ఉన్న గన్‌ తీసుకోవడానికి ప్రయత్నించే లోపలే ఆ దొంగ పరుగు లంకించుకున్నాడు. డోర్‌ను ఒక్క తన్ను తన్ని.. జారిపోతున్న ప్యాంట్‌ను ఓ చేతపట్టుకుని పరుగు అందుకున్నాడు.

అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు ఆ షాప్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దాంతో దొంగను పట్టుకోవడానికి అరోరా పోలీసులు ఈ ఫుటేజీని ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేశారు. ఇలా షేర్‌ చేసిన 12 గంటల్లోనే వేలాదిమంది ఈ వీడియోను వీక్షించి రకరకాల కామెంట్లు పెట్టారు. కొందరైతే ‘నీకు ఈ దొంగతనాలు సూట్‌ కావు వేరే పని చూసుకో’’ అంటూ సూచించారు. ప్రస్తుతం ఈ దొంగను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top