దేశంపై దాడి చేసే ఏ ఉగ్రవాదిని వదిలి పెట్టం : జైట్లీ

Arun Jaitley Says If the USA Can Conduct an Operation then India Can Also Do That - Sakshi

న్యూఢిల్లీ : తమ దేశంపై దాడి చేసే ఏ ఉగ్రవాదిని వదిలి పెట్టబోమని భారత ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేశారు. లాడెన్‌ను పాక్‌లోనే అమెరికా మట్టుపెట్టినప్పుడు తామేందుకు ఊరుకోవాలని ప్రశ్నించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఏదైనా జరగొచ్చని, దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం భారత వాయుసేన ఉగ్రవాద శిభిరాలే లక్ష్యంగా జరిపిన మెరుపు దాడులకు దీటుగా పాక్‌ భారత్‌పై దాడులకు ప్రయత్నించింది. ఈ దాడులను భారత భద్రతా బలగాలు తిప్పికొట్టడంతో తోక ముడిచిన పాక్‌ సైన్యం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top