కుదేలైన అమెజాన్‌.. కారణం?

Amazon loses Usd30 billion in market value after report Trump wants to curb its power - Sakshi

వాషింగ్టన్:  గ్లోబల్‌ ఆన్‌లైన్‌ రీటైల్‌  దిగ్గజం  అమెజాన్‌కు ట్రంప్‌ షాక్‌ తగిలింది.  అమెజాన్‌పై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్‌ దానికి చెక్‌ పెట్టేందుకు ప్రణాళికలో ఉన్నారన్న  తాజా మీడియా నివేదికల నేపథ్యంలో అమెజాన్‌ ​ షేరు భారీగా నష్టోయింది. ఒక్క బుధవారమే షేరు 5శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో 7 శాతం కుప్పకూలింది. కంపెనీ పన్ను చెల్లింపులు, విదేశాలలో విస్తరణ ప్రణాళికలు వంటి అంశాలపై ప్రెసిడెంట్ ట్రంప్‌ దృష్టిసారించనున్నట్లు వెలువడ్డ వార్తలతో దాదాపు మూడేళ్ల కనిష్టాన్ని తాకింది. అమెజాన్‌ 30 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ వాల్యూని కోల్పోయింది.   

ముఖ‍్యంగా  యాంటీ ట్రస్ట్ చట్టాన్ని  ఉపయోగించేందుకు  ముమ్మరంగా చర‍్చలు నిర్వహించారని యాక్సోస్‌ అనే వెబ్‌సైట్‌ నివేదించింది. అమెజాన్‌ కారణంగా చిన్న తరహా, ప్రధానంగా తన సొంత  (మామ్‌ అండ్‌ పాప్‌) వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుండటంపై ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేసినట్టు నివేదించింది. దీంతో మార్కెట్లో అమెజాన్‌ షేర్‌కు అమ్మకాల సెగ తాకింది.  సుమారు రూ. 20వేలకోట్ల  సంపద తుడిచి పెట్టుకు పోయింది. అయితే వైట్ హౌస్ ప్రతినిధి సారా సాండర్స్  స్పందిస్తే ట్రంప్‌ ఎపుడూ డిఫరెంట్‌గా  ఆలోచిస్తుంటారనీ,  కానీ  విధానానికి సంబంధించి నిర్దిష్ట విధానాలు లేవని చెప్పారు. అలాగే ఫేక్‌ న్యూస్‌ తన పరిపాలన ప్రధానఅడ్డంకిగాఉన్నాయంటూ అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌  భాగస్వామ్యంలోని వాషింగ‍్టన్‌ పోస్ట్‌పై ఇటీవల విరుకుచుపడటం గమనార్హం. మరోవైపు ఈ వార్తలపై అమెజాన్‌  ఇంకా స్పందించలేదు.

కాగా,  ఆన్‌లైన్‌ రీటైలర్స్‌పై  ఇంటర్నెట్‌ టాక్స్‌ విధించాలనే  ఆలోచనను గతంలోనే ట్రంప్‌ బహిరంగా ప్రకటించారు.  అమెజాన్‌ను టార్గెట్‌  చేస్తూ ట్విటర్‌లో తీవ్రంగా స్పందించారు. పన్ను చెల్లిస్తున్న చిరు వ్యాపారులకు అమెజాన్ బాగా నష్టం కలిగిస్తోంది. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా  ప్రజలు బాధపడుతున్నారు. అమెరికా ప్రజలు భారీగా ఉద్యోగాలు కోల్పొతున్నారంటూ నిప్పులు చెరిగిన సంగతి విదితమే. ఈ సందర‍్భంగా  కేవలం రెండు గంటల్లోనే 1.2 శాతం నష్టంతో 5.7 బిలియన్ డాలర్ల(36 వేల కోట్ల రూపాయలు) నష్టపోయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top