'ఐదుగురు మహిళలతో సంబంధాలు లేవు' | affair with 5 women is a lie, says cruz | Sakshi
Sakshi News home page

'ఐదుగురు మహిళలతో సంబంధాలు లేవు'

Mar 26 2016 8:21 PM | Updated on Aug 25 2018 7:50 PM

'ఐదుగురు మహిళలతో సంబంధాలు లేవు' - Sakshi

'ఐదుగురు మహిళలతో సంబంధాలు లేవు'

అగ్రరాజ్యం అమెరికాలోనూ రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నట్లు కనిపిస్తున్నాయి.

అగ్రరాజ్యం అమెరికాలోనూ రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నట్లు కనిపిస్తున్నాయి. భార్యలపై కామెంట్లు చేసుకోవడం, అభ్యర్థులు తమ ప్రత్యర్థుల భార్యల న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియలో షేర్ చేయడం లాంటివి చేస్తూ చవకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్, ట్రెడ్ క్రూజ్ ల మధ్య ఉన్న పోటీ వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దారితీస్తుంది.

ట్రెడ్ క్రూజ్ కు ఐదుగురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ పార్టీకే చెందిన ఓ ప్రముఖ ప్రత్యర్థి ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ వార్త ఆ నాటా ఈ నోటా పాకి మీడియాకు చేరింది. వార్త పత్రికల్లో ఈ విషయాలు ప్రచురితమవ్వడంతో ట్రెడ్ క్రూజ్ ఈ పుకార్లపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తనకు ఐదుగురు మహిళలతో సంబంధాలున్నాయిని వచ్చిన వార్తల్లో వాస్తవాలు లేవని, అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. ఆ వార్తలు నిజమని నిరూపించాలంటూ ట్రంప్ కు సవాలు విసిరారు. రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ట్రంప్ మాత్రం ఆ ఆరోపణలతో తనకు లింకు లేదని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement