ఉత్తర కొరియా అత్యాధునిక రాకెట్‌ పరీక్ష | Advanced rocket test of North Korea | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియా అత్యాధునిక రాకెట్‌ పరీక్ష

Mar 20 2017 12:59 AM | Updated on Sep 5 2017 6:31 AM

ఉత్తర కొరియా అత్యాధునిక రాకెట్‌ పరీక్ష

ఉత్తర కొరియా అత్యాధునిక రాకెట్‌ పరీక్ష

ఉత్తర కొరియా సోహేలో శనివారం అత్యాధునిక రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది.

పరీక్షకు హాజరైన దేశాధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌

టోక్యో: ఉత్తర కొరియా సోహేలో శనివారం అత్యాధునిక రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షకు ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ అత్యాధునిక రాకెట్‌ పరీక్షతో దేశ అంతరిక్ష కార్యక్రమం విప్లవాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఈ రోజు ఉత్తర కొరియా సాధించిన విజయాన్ని ప్రపంచమంతా చూసిందని..స్వదేశీ రాకెట్‌ పరిశ్రమలో మార్చి 18 ని విప్లవాత్మకమైన రోజుగా  అభివర్ణించారు.

ఈ క్షిపణి పరీక్ష విజయం పట్ల ఆ దేశ మీడియా స్వదేశీ రాకెట్‌ పరిశ్రమను ఆకాశానికెత్తేసింది. గత రాకెట్‌ ఇంజిన్‌ల కంటే కచ్చితమైన, సురక్షితమైన నియంత్రణ వ్యవస్థను కలిగి ఉండటం ఈ రాకెట్‌ ప్రత్యేకతలు. పంచవర్ష ప్రణాళికలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు, వచ్చే పదేళ్లలో చంద్రుడి వద్దకు ఉపగ్రహాన్ని పంపించేందుకు ఇటువంటి అత్యాధు నిక రాకెట్‌లు అవసరమవుతాయని ఉత్తర కొరియా అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement