పెళ్లివిందులో ఘర్షణ, 21మంది మృతి | 20 dead in wedding party clash in Afghanistan | Sakshi
Sakshi News home page

పెళ్లివిందులో ఘర్షణ, 21మంది మృతి

Jul 27 2015 11:11 AM | Updated on Sep 3 2017 6:16 AM

పెళ్లివిందులో  ఘర్షణ, 21మంది మృతి

పెళ్లివిందులో ఘర్షణ, 21మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ కు సమీపంలో ఓ పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. దెహస్లా గ్రామంలోని పెళ్లి విందు చెలరేగిన చిన్న వివాదం కాల్పులకు దారి తీసింది.

కాబూల్:  ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ కు సమీపంలో ఓ పెళ్లింట   విషాదం చోటు చేసుకుంది.  దెహస్లా గ్రామంలోని పెళ్లి  విందులో చెలరేగిన చిన్న వివాదం కాల్పులకు దారి తీసింది.   తీవ్ర ఆగ్రవేశాలతో  ఇరువర్గాలు పరస్పరం కాల్పులు  జరపడంతో 21  మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.   మృతుల్లో పిల్లలు, వృధ్దులు ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బంధువుల రోదనలతో ఆ ఇంట  విషాదం నెలకొంది.

సుదీర్ఘ కాలంగా వైరం కొనసాగుతున్న రెండు గ్రూపుల మధ్య రగిలిన వివాదం కాల్పులు దారి తీసినట్టుగా పోలీసులు  చెబుతున్నారు.   క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని,   పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక పోలీసు అధికారి గులిస్తాన్ ఖాన్  తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement