నోట్ల రద్దుపై ప్రధానికి వైఎస్‌ జగన్‌ లేఖ | ys jagan writes letter to PM modi on demonetisation | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై ప్రధానికి వైఎస్‌ జగన్‌ లేఖ

Nov 23 2016 8:01 PM | Updated on Aug 15 2018 6:34 PM

నోట్ల రద్దుపై ప్రధానికి వైఎస్‌ జగన్‌ లేఖ - Sakshi

నోట్ల రద్దుపై ప్రధానికి వైఎస్‌ జగన్‌ లేఖ

పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లేఖ రాశారు.

హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లేఖ రాశారు. ఉత్తమ ప్రణాళికల ఉద్దేశాలు మంచివే అయినా వాటిని సరిగ్గా అమలుచేయకపోతే విఫలమవుతాయని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దును స్వాగతిస్తూనే.. ఈ నిర్ణయం వల్ల రైతులు, గ్రామీణ కార్మికులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు, రోజువారీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నట్టు వైఎస్‌ జగన్‌ తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో రోజురోజుకు నిరుపేదలు, చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగం, రిటైల్‌ రంగాలు తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. మార్కెట్‌ యార్డులు, మండీలలో కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయని, వందేళ్ల చరిత్ర కలిగిన అనకాపల్లి బెల్లం హోల్‌సేల్‌ మార్కెట్‌ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. 

ఇక, నోట్ల రద్దు తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా ఉందని లేఖలో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. రైతుల్లో 40శాతం మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయని తెలిపారు. 60శాతం మంది రైతులకు వడ్డీ వ్యాపారులే ఆధారమన్నారు. ఇప్పుడు రైతులకు ఎక్కడా డబ్బు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 95శాతం రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలు అమ్మేవారు పాతనోట్లను తీసుకోవడం లేదని తెలిపారు. నోట్ల రద్దుతో పండిన పంటను సైతం రైతులు అమ్ముకోలేకపోతున్నారని, దీంతో మద్దతు ధరలో సగం ధరకే మధ్యవర్తులకు పంట అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 6.38 లక్షల గ్రామాల్లో నగదు ఆధారంగానే లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఒకే ఒక్క నిర్ణయంతో రాత్రికి రాత్రే మార్పు రాదని అన్నారు. నోట్ల రద్దుతో చాలామంది పెళ్లిళ్లు చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు.  
 
లేఖలోని మరికొన్ని ప్రధానాంశాలు
  • రాజకీయాల నుంచి నల్లధనాన్ని ఏరివేయడానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
  • ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడానికి మేం మద్దతునిస్తాం.
  • ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అధిగమించడానికి ప్రయత్నించాలి
  • అన్ని రాజకీయ పార్టీల సభ్యులతో కమిటీ ఏర్పాటుచేయాలి
  • ఈ కమిటీలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి తెలిసిన అనుభవజ్ఞులైన నిపుణులు ఉండాలి
  • పాతనోట్ల చెల్లుబాటు తేదీపై పునరాలోచన చేయాలి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement