నకిలీ వీసాతో పట్టుబడిన మహిళ అరెస్ట్ | woman arrested with fake visa | Sakshi
Sakshi News home page

నకిలీ వీసాతో పట్టుబడిన మహిళ అరెస్ట్

Jun 5 2016 6:22 PM | Updated on Aug 20 2018 4:27 PM

నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

శంషాబాద్: నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన రేణుక(35) ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళుతుండగా ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె వద్ద ఉన్న వీసా నకిలీదిగా గుర్తించి ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. అయితే తాను ఏజెంట్ చేతిలో మోసపోయానంటూ సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement