
రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తాం
కేంద్ర భూసేకరణ చట్టానికి (2013) రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసి తీసుకువచ్చిన 2016 భూ సేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
2016 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం సాగుతుందని, న్యాయపోరాటం కూడా చేస్తామని చెప్పారు. ఈ చట్టం ద్వారా చేస్తున్న భూ సేకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతులే ఎక్కువగా నష్టపోతున్నారని వివరించారు. కూకట్‌పల్లి భూ కుంభకోణాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో న్యాయవాదులు అర్జున్, రవీందర్, శ్రవణ్, మల్లేశం, ధర్మార్జున్ తదితరులు పాల్గొన్నారు.