మల్కాజ్‌గిరి చంద్రబాబు నగర్ నాలాలో మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది.
మల్కాజ్‌గిరి చంద్రబాబు నగర్ నాలాలో మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి (పురుషుడు) మృతదేహం కొట్టుకువచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బండచెరువు నిండి నీళ్లు వస్తున్నాయి. చెరువు నీళ్లలో మృతదేహం కొట్టుకు వచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మల్కాజ్‌గిరి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.