రోడ్డు ప్రమాదం: ఇద్దరి దుర్మరణం | Two killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: ఇద్దరి దుర్మరణం

Aug 29 2013 1:42 AM | Updated on Sep 1 2017 10:12 PM

బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ వద్ద బుధవారం లారీ, స్కార్పియో ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

శంషాబాద్, న్యూస్‌లైన్: బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ వద్ద బుధవారం లారీ, స్కార్పియో ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు జేపీ సిమెంట్ సంస్థ జాయింట్ వైస్ ప్రెసిడెంట్ పి.వి గోపాలకృష్ణన్ ఉన్నారు. అతివేగం, రోడ్డుపై మూలమలుపులో వాహనాలు అదుపుతప్పడంతోనే ఈ దుర్ఘటన జరిగింది. ఆర్‌జీఐఏ ఠాణా ఎస్‌ఐ కాశీవిశ్వనాథ్ కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న జేపీ సిమెంట్ కంపెనీ జాయింట్ వైస్ ప్రెసిడెంట్ పీవీ గోపాలకృష్ణన్ హైదరాబాద్‌లోని కంపెనీ కార్యాలయంలో మంగళవారం పనులు ముగించుకున్నారు. అక్కడి నుంచి సెలవుపై కేరళ రాష్ట్రం లోని సొంతూరు కున్నూరుకు వెళ్లేందుకు బుధవారం తెల్లవారుజామున స్కార్పియో వాహనంలో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు.  

ఈ క్రమంలో శంషాబాద్ పట్టణంలో మూలమలుపు వద్ద పొట్టు లోడుతో ఉన్న లారీ వేగంగా వచ్చి స్కార్పియో వాహనాన్ని ఢీకొంది. దీంతో వెనుక సీట్లో కూర్చున్న గోపాలకృష్ణన్(51)తోపాటు, మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన డ్రైవర్ లినేష్ (29) అక్కడికక్కడే మృతి చెందారు. కరీంగనగర్ జిల్లాకు చెం దిన మరో డ్రైవర్ జహీర్‌ఖాన్ (29)కు తీవ్ర గా యాలవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గోపాలకృష్ణన్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు

Advertisement
 
Advertisement
Advertisement