లొకేశ్తో టీటీడీపీ నేతల భేటి | TTDP leaders discussed with nara lokesh over GHMC elections | Sakshi
Sakshi News home page

లొకేశ్తో టీటీడీపీ నేతల భేటి

Dec 11 2015 10:48 PM | Updated on Aug 29 2018 3:37 PM

లొకేశ్తో టీటీడీపీ నేతల భేటి - Sakshi

లొకేశ్తో టీటీడీపీ నేతల భేటి

కీలక అంశాలపై తెలంగాన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.

సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే మునిగిన పుట్టికి ఎలాంటి మరమ్మతులు చేయాలి, తేదీలు నిర్ధారణ కావటంతో దూసుకొస్తున్న గ్రేటర్ ఎన్నికల గండం నుంచి పార్టీని ఎలా కాపాడుకోవాలి? బల్దియాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాటంటే ఏం చెయ్యాలి? ఆ మేరకు పార్టీ శ్రేణులను ఏవిధంగా సమాయత్తం చేయాలి? తదితర కీలక అంశాలపై తెలంగాన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం తెలంగాణ టీడీపీ నేతలు లోకేష్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, జిహెచ్‌ఎంసి ఎన్నికలపై రెండు విడతలుగా చర్చ జరిగిందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈనెల 15వ తేదీన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో ముఖ్య నేతలు, గ్రేటర్ నేతలతో సమావేశం జరపాలని నిర్ణయించారు. 16, 17 తేదీల్లో డివిజన్ల వారీగా సమీక్షలు జరపనున్నారు. 21వ తేదీన జెండా పండుగ నిర్వహించడంతో పాటు 24వ తేదీన నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ జరపాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారని పార్టీ వర్గాలు చెప్పాయి. లోకేష్‌తో జరిగిన ఈ సమావేశంలో టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, నగర అధ్యక్షుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement