అక్రమ పద్ధతులతో టీఆర్‌ఎస్ రాజకీయం: టీడీపీ | TRS with the politics of illegal methods: TDP | Sakshi
Sakshi News home page

అక్రమ పద్ధతులతో టీఆర్‌ఎస్ రాజకీయం: టీడీపీ

Feb 9 2016 3:12 AM | Updated on Aug 10 2018 8:16 PM

అక్రమ పద్ధతుల ద్వారా రాజకీయాలు చేయడమే టీఆర్‌ఎస్ పార్టీకి తెలిసిన విద్య అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది.

సాక్షి, హైదరాబాద్: అక్రమ పద్ధతుల ద్వారా రాజకీయాలు చేయడమే టీఆర్‌ఎస్ పార్టీకి తెలిసిన విద్య అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. అధికారంలో రావడానికి సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకున్న టీఆర్‌ఎస్, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిందని ఆ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కర్నాటి విద్యాసాగర్ ఒక ప్రకటనలో విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏకంగా ఈవీఎంలనే ట్యాంపరింగ్ చేసిందని ఆయన ఆరోపించారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రలోభాలకు దిగి బెదిరించడం, దౌర్జన్యం చేయడం ద్వారా పైచేయి సాధించిందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు దక్షిణ భారతదేశంలో తెలంగాణలో అత్యధికంగా నమోదు కావడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement