ఆ రోడ్లను మూసివేయొద్దు.. | trs leaders met finance minister arun jaitley on cantonment issue | Sakshi
Sakshi News home page

ఆ రోడ్లను మూసివేయొద్దు..

May 12 2017 2:55 AM | Updated on Sep 5 2017 10:56 AM

ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్‌  జైట్లీని కలసిన ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ

ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని కలసిన ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ

హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని రోడ్లను డిఫెన్స్‌ సిబ్బంది మరోమారు మూసివేయడాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీలు రక్షణ శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ దృష్టికి తీసుకొచ్చారు

కంటోన్మెంట్‌ రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రి జైట్లీని కోరిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని రోడ్లను డిఫెన్స్‌ సిబ్బంది మరోమారు మూసివేయడాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీలు రక్షణ శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ దృష్టికి తీసుకొచ్చారు. గురువారం ఈ మేరకు జైట్లీని ఆయన కార్యాలయంలో ఎంపీలు జితేందర్‌ రెడ్డి, బి.వినోద్‌ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ కలుసుకున్నారు. 35 వేల మంది జనాభా ఉన్న కంటోన్మెంట్‌ ప్రాంతంలో డిఫెన్స్‌ సిబ్బంది అకస్మాత్తుగా రోడ్లను మూసివేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసే వరకు రహదారులను మూసివేయకుండా చర్యలు తీసుకోవాలని కోరా రు. దీనిపై జైట్లీ సానుకూలంగా స్పందించారని సమావేశం అనంతరం జితేందర్‌ రెడ్డి మీడియాకు తెలిపారు. జేబీఎస్‌– కరీంనగర్‌ జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి అవసరమైన 100 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరినట్లు వెల్లడించారు.

ఎయిమ్స్‌కు నిధుల్విండి: తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను జితేందర్‌ రెడ్డి, వినోద్‌ కోరారు.

ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంకు పేరు మార్చండి..
తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ పేరును తెలంగాణ గ్రామీణ వికాస్‌ బ్యాంకుగా మార్చాలని కేంద్ర మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ను ఎంపీ వినోద్‌ కోరారు. గంగ్వార్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకున్న వినోద్‌.. రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ మొత్తానికి ఒకే గ్రామీణ బ్యాంకు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement