టుడే న్యూస్ అప్‌డేట్స్ | today newsupdates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Apr 23 2016 7:23 AM | Updated on Sep 17 2018 5:18 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ‘సేవ్ డెమొక్రసీ’ నిర్వహించనుంది.

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ‘సేవ్ డెమొక్రసీ’ నిర్వహించనుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమాలకు వామపక్షాలతో పాటు పలు రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుస్తారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం శనివారం భేటీకానుంది. ఉదయం 11 గంటలకు గోల్కొండ హోటల్‌లో జరిగే సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు.


న్యూ ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు శనివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీం చీఫ్ జస్టిస్, న్యాయమూర్తుల సమావేశానికి ఆయన హాజరవుతారు.

హైదరాబాద్: నేడు హజ్‌హౌస్‌లో గురుకుల వెబ్‌సైట్‌ను డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ ప్రారంభిస్తారు.

ఆంధ్రప్రదేశ్: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. పెదవేగిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగును.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement