తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
కుత్బుల్లాపూర్ లో యువకుడి ఆత్మహత్య
Aug 24 2016 6:58 PM | Updated on Nov 6 2018 8:04 PM
- తండ్రి మందలించడంతో ప్రాణాలు తీసుకున్న యువకుడు
కుత్బుల్లాపూర్
తాగి ఇంటికి వస్తున్న కొడుకును తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొంపల్లి లంబాడీ బస్తీలో నివాసముండే రాము కుమారుడు రాజేష్(20) హమాలీ పనులు చేస్తుంటాడు. ప్రతినిత్యం తాగి ఇంటికి వస్తుండడంతో తండ్రి అతన్ని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజేష్ మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో తలుపులు వేసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు తలుపులు బద్దలకొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement