పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 6న విడుదల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది.
ఈ ఫలితాలను పాఠశాల విద్య ఇన్‌చార్జి కమిషనర్ విజయ్‌కుమార్ విడుదల చేయనున్నారు. గత నెలలో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,00,237 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను www. sakshieducation. com, www. sakshi. com, bsetelangana. org, results. cgg. gov. in వెబ్‌సైట్‌ల్లో పొందవచ్చు.