తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలపై ప్రతిపక్షాలు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశాయి. మూడు రోజులుగా బడ్జెట్పై జరిగిన సాధారణ చర్చను శనివారంతో ముగిసినట్లు ప్రభుత్వం తెలిపింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలపై ప్రతిపక్షాలు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశాయి. మూడు రోజులుగా బడ్జెట్పై జరిగిన సాధారణ చర్చను శనివారంతో ముగిసినట్లు ప్రభుత్వం తెలిపింది.
దీనిపై విపక్ష ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, రేవంత్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... బడ్జెట్ కేటాయింపులపై తాము అడిగిన వివరాలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం అసెంబ్లీను అర్థవంతంగా వాయిదా వేసి పారిపోయిందని ఆరోపించారు. లక్షా 30 వేల కోట్ల బడ్జెట్ వాస్తవ విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ అమలు చేయలేదని.. ముప్పై వేల కోట్లు సమకూర్చుకోలేరన్న తమ ప్రశ్నలకు ఈటల సమాధానమివ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ ప్రజల కోసమా.. కాంట్రాక్టర్ల కోసమా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పలేదంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన సమాధానమే అభివృద్ధి సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధి అర్ధమవుతుందన్నారు.