వాణిజ్య పన్ను వసూళ్లలో దూకుడు | Sakshi
Sakshi News home page

వాణిజ్య పన్ను వసూళ్లలో దూకుడు

Published Sat, Aug 13 2016 2:14 AM

telangana improved in commercial tax collection

సాక్షి, హైదరాబాద్: వ్యాట్‌తోపాటు లగ్జరీ ట్యాక్స్, వినోదపన్ను మొదలైన 7రకాల పన్ను వసూళ్లలో రాష్ట్రం దక్షిణాదిలో రెండోస్థానంలో నిలిచింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు జరిగిన పన్ను వసూళ్లలో కర్ణాటక 12.50% వృద్ధిరేటుతో తొలిస్థానంలో నిలవగా, రాష్ట్రం 11.88%తో రెండోస్థానంలో నిలిచింది. ఏపీ 11.60% వృద్ధితో 3వ స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో కేరళ (7%), తమిళనాడు (6.5%) ఉన్నాయి. వాణిజ్యపన్నుల శాఖ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్ల మేర ఆదాయం వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. తొలి 4 నెలల్లో(ఏప్రిల్-జూలై) రూ.11,500 కోట్లు సాధించింది.

Advertisement
Advertisement