
బతికే తెలంగాణ కావాలి: తమ్మినేని
రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవసరం లేదు.. బతికే తెలంగాణ కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
గండేడ్/ హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవసరం లేదు.. బతికే తెలంగాణ కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాద యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటయ్యాక ఇచ్చిన హమీలను నెరవేర్చలేని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఏవిధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తన మాటలతో మోసం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సీటుకు రోజులు దగ్గరపడ్డాయని.. త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు.
రైతు రుణమాఫీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ తదితర పథకాలు అటకెక్కాయని తీవ్ర స్థారుులో ధ్వజమెత్తారు. కాగా, చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసి రూ.వెరుు్య కోట్లతో సంక్షేమ నిధిని కేటారుుంచాలని ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. కార్మికుల పరిస్థితి గతం కంటే దుర్భరంగా మారిందని సీఎంకు రాసిన లేఖలో ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
సమస్యలపై ప్రత్యక్ష కార్యాచరణకు సీపీఎం పిలుపు
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ పాదయాత్ర సంద ర్భంగా ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై వచ్చిన విజ్ఞప్తులు, వివిధ ప్రాంతాలు, వర్గాల వారు ప్రస్తావిం చిన సమస్యలపై ప్రత్యక్ష కార్యాచరణను చేపట్టాలని పార్టీ నేతలు, కేడర్‌కు సీపీఎం శుక్రవారం పిలుపు నిచ్చింది. ఈ పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపింది. పాదయాత్ర సాగిన అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు బి.వెంకట్, టి.సాగర్ కోరారు. శనివారం పరిగిలో బీసీసంక్షేమసంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఆదివారం వికారాబాద్‌లో పౌరహక్కుల ఉద్యమనేత ప్రొ. హరగోపాల్, 15న తాండూరులో టీజేఏసీ చైర్మన్ కోదండరాం పాల్గొం టారన్నారు.