
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయండి
రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లు లు, రైస్ మిల్లులతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లు లు, రైస్ మిల్లులతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఆ పార్టీ తలపెట్టిన మహాజన పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఆయన ఆదివారం సీఎంకు లేఖ రాశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 17 జిల్లాల్లో పాదయాత్ర చేపట్టగా వేలాది సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. జమ్మికుంట, హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉపాధి కొరత తీవ్రంగా ఉందని.. అక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ప్రజాసమస్యలపై వీలైనంత త్వరగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.