'ఈస్టిండియా కంపెనీకి, బాబుకు తేడా లేదు' | tammineni sitharam takes on chandra babu government | Sakshi
Sakshi News home page

'ఈస్టిండియా కంపెనీకి, బాబుకు తేడా లేదు'

Jan 9 2016 1:31 PM | Updated on Jul 11 2019 9:04 PM

'ఈస్టిండియా కంపెనీకి, బాబుకు తేడా లేదు' - Sakshi

'ఈస్టిండియా కంపెనీకి, బాబుకు తేడా లేదు'

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విమానాశ్రయాల పేరుతో పేదల భూములు బలవంతంగా లాక్కొంటోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆరోపించారు.

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విమానాశ్రయాల పేరుతో పేదల భూములను బలవంతంగా లాక్కొంటోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆరోపించారు. శనివారం వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో తమ్మినేని మీడియాతో మాట్లాడారు.

ఈస్టిండియా కంపెనీకి చంద్రబాబుకు తేడా లేదని తమ్మినేని విమర్శించారు. రాజధాని పేరుతో తాబేదారులకు భూములు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల పొట్టకొట్టి రాజకీయ నాయకుల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు, వారి బంధువులకు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను చౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement