8 మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల సస్పెన్షన్ | suspension of 8 ghmc employees | Sakshi
Sakshi News home page

8 మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల సస్పెన్షన్

Feb 7 2016 9:36 PM | Updated on Sep 3 2017 5:08 PM

మాదాపూర్‌లో ముజ్రా పార్టీలో పోలీసులకు పట్టుపడ్డ జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు 8 మందిని కమిషనర్ జనార్దన్‌రెడ్డి సస్పెండ్

గచ్చిబౌలి: మాదాపూర్‌లో ముజ్రా పార్టీలో పోలీసులకు పట్టుపడ్డ జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు 8 మందిని క మిషనర్ జనార్దన్‌రెడ్డి సస్పెండ్ చేశారు. శనివారం రాత్రి మాదాపూర్ ఖానామెట్‌లోని ఫాతిమా గెస్ట్‌హౌస్‌లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారని తెలియడంతో సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. మద్యం సేవిస్తూ యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తుండగా అక్కడున్న వారిని 24 మందిని అరెస్ట్ చేశారు. నిందితులపై ఐపీసీ 188, 294 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అలాగే ముజ్రా పార్టీ నిర్వాహకుడు సఫ్దార్(35), ఫాతిమా గెస్ట్‌హౌస్ నిర్వాహకురాలు జరీనా, వాచ్‌మెన్ నవీన్ శర్మ(45), డ్రై వర్లు బనో శరత్(43) దశరథ్(24)లను అరెస్ట్ చేఛశారు.

అలాగే, ఎం.డి.ముషాఫ్(25)లతో పాటు జల్సా చేసేందుకు వచ్చిన పి.బాపు(27), ఎం.డి.కలీం(39), ఎం.డి.యూసూఫ్ ఖాన్(49), ఎం.డి.సిరాజ్(50)తోపాటు... శేరిలింగంపల్లి సర్కిల్-11 ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ కుమార్(53), సర్కిల్-12 ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ సాయినాథ్ అలియాస్ పద్మభూషణ్ రాజు(48,) సర్కిల్-14 ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ రవిందర్(54), సర్కిల్-11 బిల్ కలెక్టర్లు ఆర్.జ్ఙానేశ్వర్(30), వై.నరహరి(30), కె.కృష్ణ(26), రణవీర్ భూపాల్(40), సర్కిల్-12 బిల్ కలెక్టర్ వై.బాబురావు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. కాగా, యువతులతో కలసి జల్సా చేసిన 8 మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులను కమిషనర్ బి.జనార్ధన్‌రెడ్డి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు వెస్ట్ జోన్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement