హైదరాబాద్ పాతబస్తీలో బాల్య వివాహాన్ని సౌతో జోన్ పోలీసులు అడ్డుకున్నారు. రెయిన్ బజార్లో బాల్య వివాహం జరుగుతున్నట్లు స్థానికులు సమాచారం అందించటంతో..
పాతబస్తీలో బాల్య వివాహం అడ్డుకున్న పోలీసులు
Aug 3 2015 9:38 AM | Updated on Aug 20 2018 3:58 PM
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో బాల్య వివాహాన్ని సౌతో జోన్ పోలీసులు అడ్డుకున్నారు. రెయిన్ బజార్లో బాల్య వివాహం జరుగుతున్నట్లు స్థానికులు సమాచారం అందించటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ సందర్భంగా బాలికను నిఖా చేసుకునేందుకు సిద్ధపడ్డ ఓ అరబ్ షేక్ సహా పలువురిని అరెస్ట్ చేశారు.
బాలికకు పోలీసులు విముక్తి కలిగించారు. కాగా నిఖా జరిపేందుకు మధ్యవర్తిత్వం నడిపిన బ్రోకర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత రెండు రోజుల క్రితం ఛత్రీనాకలో ఓ బాల్య వివాహాన్ని కూడా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement