బంజారాహిల్స్‌లో యువతిపై రెచ్చిపోయిన పోకిరీలు | some youth in banjarahills misbehave at girl | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో యువతిపై రెచ్చిపోయిన పోకిరీలు

Jul 15 2017 9:31 PM | Updated on Sep 5 2017 4:06 PM

బంజారాహిల్స్‌లో యువతిపై రెచ్చిపోయిన పోకిరీలు

బంజారాహిల్స్‌లో యువతిపై రెచ్చిపోయిన పోకిరీలు

బంజారాహిల్స్‌లో పోకిరీలు రెచ్చిపోయారు. రోడ్డు నెంబర్‌ 12లో ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో పోకిరీలు రెచ్చిపోయారు. రోడ్డు నెంబర్‌ 12లో ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను అనకూడని మాటలు అనడంతోపాటు బైక్‌లు దిగి వెళ్లి ఆ యువతిపై చేయి చేసుకున్నారు. దీంతో వారికి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా ఆ యువతి గట్టిగా ప్రతిఘటించింది.

ఆమెకు దారిన పోయేవారు కూడా ఆ యువకులను పట్టుకునేందుకు పోగవడంతో ఆ పోకిరీలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ నెల 11న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులకు పోకిరీలు పాల్పడిన దుశ్చర్యలకు సంబంధించిన ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న పోకిరీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు దొరికిన తర్వాత కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement