రేబిస్‌తో ఆరేళ్ల బాలుడు మృతి | six years boy dies of rabis | Sakshi
Sakshi News home page

రేబిస్‌తో ఆరేళ్ల బాలుడు మృతి

May 6 2015 7:07 PM | Updated on Nov 6 2018 4:56 PM

రేబిస్ వ్యాధికి ఆరేళ్ల బాలుడు బలైపోయాడు. ఒడిశాకు చెందిన బాలుడు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

హైదరాబాద్: రేబిస్ వ్యాధికి ఆరేళ్ల బాలుడు బలైపోయాడు. ఒడిశాకు చెందిన బాలుడు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఒడిశాకు చెందిన జోగేందర్, అతని కుటుంబ సభ్యులు ఉపాధి కోసం హయత్‌నగర్‌కు వచ్చి నివాసముంటున్నారు. అయితే, జోగేందర్ కుమారుడు దివాకర్ (6) రెండు నెలల క్రితం ఒడిశాలోని తమ స్వగ్రామంలో కుక్క కాటుకు గురయ్యాడు. నిరక్షరాస్యులైన జోగేందర్ కుటుంబ సభ్యులు ఆ సమయంలో దివాకర్‌కు ఎలాంటి చికిత్సలు చేయించలేదు.

అయితే, దివాకర్ వింతగా ప్రవర్తిస్తుండడంతో చికిత్స కోసం బుధవారం తెల్లవారు జామున నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో గత 20 రోజుల వ్యవధిలో ముగ్గురు రేబిస్‌తో మృతి చెందడం గమనార్హం. ఏప్రిల్ 17న నిజామాబాద్ జిల్లా సీతారాంపల్లికి చెందిన ఇంద్రమ్మ(43) మృతి చెందగా, అదే నెల 30న మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్‌కు చెందిన యాదయ్య(65) మృతి చెందాడు.
(నల్లకుంట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement