బీసీ కమిషన్‌ బిల్లు పాస్‌ చేయాలి | Should pass the BC commission bill | Sakshi
Sakshi News home page

బీసీ కమిషన్‌ బిల్లు పాస్‌ చేయాలి

Aug 5 2017 12:53 AM | Updated on Aug 10 2018 8:27 PM

పార్లమెంట్‌లోని రెండు సభలు ఆమోదం తెలుపుతూ జాతీయ బీసీ కమిషన్‌ బిల్లును పాస్‌ చేయాలని, దీని కోసం ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది.

ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌.. నేడు పార్లమెంట్‌ వద్ద భారీ ప్రదర్శన
 
సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌లోని రెండు సభలు ఆమోదం తెలుపుతూ జాతీయ బీసీ కమిషన్‌ బిల్లును పాస్‌ చేయాలని, దీని కోసం ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు 36 రాజకీయ పార్టీల ఫ్లోర్‌ లీడర్లకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య శుక్రవారం లేఖలు రాశారు.

ఈ బిల్లు మార్చిలోనే పాసైందని, రాజ్యసభలో కొన్ని పార్టీలు ఈబిల్లును వీగిపోయేటట్లు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించే వరకు బీసీల పోరాటం కొనసాగుతుందని కృష్ణయ్య హెచ్చరించారు. చట్టసభల్లో, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం పార్లమెంట్‌ వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement