సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి కృషి చేయాలి | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి కృషి చేయాలి

Published Tue, Mar 6 2018 2:03 AM

Sarpanch compound Nizamabad - Sakshi

నిజామాబాద్‌ నాగారం (నిజామాబాద్‌అర్బన్‌): సర్పంచ్‌లు ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ప్రభుత్వ సం క్షేమ పథకాలను అర్హులకు అందిస్తూ గ్రామా భివృద్ధికి కృషి చేయాలని పంచాయతీరాజ్‌శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని బీఎల్‌ఎన్‌ గార్డెన్‌లో జరిగిన 13 జిల్లాల సర్పంచ్‌ల ప్రాంతీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు.

గ్రామ పంచాయతీలకు ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.40 వేల కోట్ల ఖర్చుతో మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటిని అందించే పథకం చేపట్టిందని చెప్పారు. ప్రతి గ్రామంలో 100 గజాలలో డంపింగ్‌యార్డు ఏర్పర్చుకోవాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేసి ఆ గ్రామానికి అవసరమైన మొక్కలు పెంచుతామన్నారు. త్వరలోనే సర్పంచ్‌లకు ఐ పాడ్, మొబైల్‌ఫోన్లు అందించనున్నట్లు తెలిపారు.

దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు ప్రభు త్వం రూ.13 లక్షలు ఇచ్చేదని, ఇప్పుడు దానిని రూ.16 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌  పాల్గొన్నారు. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్‌ , మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నుంచి సర్పంచ్‌లు హాజరయ్యారు.  

Advertisement
Advertisement