ఫీజు బకాయిలు విడుదల చేయండి: ఆర్‌.కృష్ణయ్య

ఫీజు బకాయిలు విడుదల చేయండి: ఆర్‌.కృష్ణయ్య - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, మెడిసిన్‌ విద్యార్థుల గత సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1600 కోట్లు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం వివిధ జిల్లా కేంద్రాల్లో వేలాది మంది విద్యార్థులు కలెక్టరేట్లు ముట్టడించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ గత సంవత్సరపు  ఫీజు బకాయిలు రాకపోవడంతో కాలేజీ యాజ మాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయన్నారు. వారి నుంచి బలవంతంగా ఫీజు లు వసూలు చేస్తున్నారని, కోర్సులు పూర్తయినా ఫీజులు కట్టేవరకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు.



దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రీయింబర్స్‌మెంటు స్కీము ప్రవేశపెట్టినప్పుడు పూర్తి ట్యూషన్‌ ఫీజులు, స్పెషల్‌ ఫీజులు, పరీక్షా ఫీజులతోసహా మంజూరు చేశారని గుర్తు చేశారు. అదే విధంగా ప్రైవేటు కాలేజీ లలో చదివే ఇంటర్‌ విద్యార్థుల ఫీజులు 8 వేల నుంచి 12 వేలవరకు ఉంటేæ ప్రభు త్వం 2 వేలు మాత్రమే మంజూరు చేస్తుందని, బ్యాలెన్సు ఫీజులు కట్టే పరిస్థితి లేక విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేష్, గుజ్జ రమేష్, భూపేష్, నరేష్, అనంతయ్య, అభిలాష్, రామకృష్ణ, లక్ష్మి, రమ్య పాల్గొన్నారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top