సింహం వదిలినా.. చట్టం వదల్లేదు! | prison for mukesh in lion case | Sakshi
Sakshi News home page

సింహం వదిలినా.. చట్టం వదల్లేదు!

Oct 2 2016 4:28 AM | Updated on Sep 4 2017 3:48 PM

సింహం వదిలినా.. చట్టం వదల్లేదు!

సింహం వదిలినా.. చట్టం వదల్లేదు!

నెహ్రూ జూలాజికల్ పార్కులో సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి సింహాన్ని రమ్మంటూ హల్‌చల్ చేసిన ముకేశ్‌కు కోర్టు శనివారం జైలు శిక్ష ఖరారు చేసింది.

సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ముకేశ్‌కు జైలు
 
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులో సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి సింహాన్ని రమ్మంటూ హల్‌చల్ చేసిన ముకేశ్‌కు కోర్టు శనివారం జైలు శిక్ష ఖరారు చేసింది. ఎర్రమంజిల్ కోర్టు న్యాయమూర్తి.. నాలుగు నెలల నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 100 జరిమానా విధించారు. వివరాలను దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. బిహార్ ప్రాంతానికి చెందిన ముకేశ్(35) బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి నాగోల్‌లో ఉంటున్నాడు.

ఈ ఏడాది మే 22న జూపార్కుకు వచ్చి సింహాల ఎన్‌క్లోజర్‌ను చూస్తూ మద్యం మత్తులో అందులోకి దూకాడు. జూ సిబ్బంది పాపయ్య, బషీర్, సింగ్, సారుు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శివలు చాకచాక్యంగా వ్యవహరిస్తూ సింహాల దృష్టి వేరే వైపు మళ్లించి ముకేశ్‌ను రక్షించారు. పోలీసులు ముఖేశ్‌పై ఐపీసీ 448, 38 సెక్షన్లతో పాటు అటవీ యాక్ట్ 1972 చట్టం కింద కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్న అతనికి న్యాయమూర్తి శనివారం శిక్ష ఖరారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement