'రాహుల్ గాంధీది ఐరన్ లెగ్' | Sakshi
Sakshi News home page

'రాహుల్ గాంధీది ఐరన్ లెగ్'

Published Thu, Jul 23 2015 6:19 PM

'రాహుల్ గాంధీది ఐరన్ లెగ్'

హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ ది ఐరన్ లెగ్ అని, ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఖాళీ అవుతుందని దుయ్యబట్టారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో జరిగిన ఆత్మహత్యలు గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించాలన్నారు. తమను విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. రాష్ట్రంలో తాము చేస్తున్న అభివృద్ధిని చూడలేకే తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.

Advertisement
Advertisement