మానవత్వం చాటిన పోలీసులు, వైద్యులు | Sakshi
Sakshi News home page

మానవత్వం చాటిన పోలీసులు, వైద్యులు

Published Fri, Sep 2 2016 7:58 PM

police, doctors Throated humanity

ఉస్మానియా వైద్యులు, పోలీసుల మానవత్వం ఓ అమ్మాయిని తన ఇంటికి చేర్చింది. గత ఆరు నెలలుగా ఉస్మానియా ఆసుపత్రి పరిసరాలు, ఫుట్‌పాత్‌లపై పడుకుంటూ కాలం వెల్లదీస్తున్న అభాగ్యురాలిని తన ఊరికి చేర్చారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మాల్ గ్రామానికి చెందిన స్వాతి(20) గత ఆరునెలల క్రితం ఊరు నుంచి నగరానికి వచ్చింది. ఇటీవల ఉస్మానియా ఆసుపత్రి పరిసరాలలో తిరుగుతుండగా గురువారం గుర్తించిన ఎస్‌పీఎఫ్ పోలీసులు అఫ్జల్‌గంజ్ సీఐ అంజయ్య, ఉస్మానియా వైద్యులు మహ్మద్ రఫీకి సమాచారం ఇవ్వడంతో అమ్మాయి నుంచి తగిన వివరాలు సేకరించి ఆసుపత్రిలో చికిత్స చేశారు. స్వాతి తన ఊరు పేరు, తన పేరు మాత్రమే చెప్తుండడంతో తన ఊరికి పంపాలని వారు నిర్ణయించి శుక్రవారం పోలీసులు వాహనాన్ని సమాకూర్చి పోలీసుల చేత స్వాతి ఊరు మాల్‌కు పంపించారు. సాక్షితో ఆర్‌ఎంఓ రఫి మాట్లాడుతూ... స్వాతి మతిస్ధిమితం కోల్పోలేదని, ఏదో భయాందోళనకు గురై ఇంటి నుండి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతుందని, ఏ విషయమడిగినా ఏడుస్తుండడంతో ఇన్‌స్పెక్టర్ అంజయ్యతో మాట్లాడి తన గ్రామానికి పంపేలా ఏర్పాటు చేశామన్నారు.


 

Advertisement
Advertisement