నేను పోలీస్.. కాల్చేస్తా ! | Police constable with pistol creates ruckus in Langar House | Sakshi
Sakshi News home page

నేను పోలీస్.. కాల్చేస్తా !

Oct 4 2013 4:16 AM | Updated on Aug 21 2018 5:44 PM

అన్నకొడుకు కదా అన్ని తక్కువ అద్దెకు ఇల్లు ఇచ్చిన పాపానికి ఆ ఇల్లే తనదని భీష్మించాడో కానిస్టేబుల్. చిన్నాన్న అని కూడా చూడగాకుండా దాడి చేసి తీవ్రంగా కొట్టాడు.

లంగర్‌హౌస్, న్యూస్‌లైన్: అన్నకొడుకు కదా అన్ని తక్కువ అద్దెకు ఇల్లు ఇచ్చిన పాపానికి ఆ ఇల్లే తనదని భీష్మించాడో కానిస్టేబుల్.  చిన్నాన్న అని కూడా చూడగాకుండా దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. తాను పోలీసునని, తుపాకీతో కాల్చేస్తానని చిందులు తొక్కాడు. స్థానిక పోలీసులు స్పందించకపోవడంతో బాధితుడు జాయింట్ పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం..

లంగర్‌హౌస్ ఎండీలైన్స్‌కు చెందిన అబ్దుల్ అమీద్(60) కొన్నేళ్ల క్రితం విదేశాలకు వెళ్లాడు. ఇదే ప్రాంతంలో ఇతను  600 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి.. గోల్కొండ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన అన్న కుమారుడు అఫ్జల్‌కు తక్కువ అద్దెకు ఇచ్చాడు. అయితే అఫ్జల్ ఆ ఇంటికి నకిలీ పత్రాలు సృష్టించి సొంత చేసుకోవాలని యత్నిస్తున్నాడని తెలియడంతో ఇల్లు ఖాళీ చేయాలని అమీద్ కొద్ది రోజులుగా అతడ్ని కోరుతున్నాడు. పట్టించుకోని అఫ్జల్ చివరకు ఇల్లే తనదని, ఖాళీ చేయనని నాలుగు రోజుల క్రితం అమీద్‌పై దాడి చేశాడు.  

తాను పోలీసునని, తుపాకీతో కాల్చేస్తానని వీరంగం సృష్టించాడు. తీవ్ర గాయాలకు గురైన అమీద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పట్టించుకోలేదు. దీంతో బాధితుడు జాయింట్ సీపీ అమిత్‌గార్గ్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు లంగర్‌హౌస్ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అఫ్జల్‌ను గోల్కొండ ఠాణా నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేసినట్లు ఆసిఫ్‌నగర్ ఏసీపీ వినోద్‌కుమార్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement