ఆ ఘనత మా ప్రభుత్వానిదే: పోచారం | pocharam srinivas reddy in assembly | Sakshi
Sakshi News home page

ఆ ఘనత మా ప్రభుత్వానిదే: పోచారం

Published Sun, Mar 27 2016 10:53 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రాష్ట్రంలో పాల ఉత్పత్తి దారులకు రూ. 4 ఇన్సెంటీవ్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: రాష్ట్రంలో పాల ఉత్పత్తి దారులకు రూ. 4 ఇన్సెంటీవ్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. పాడి పరిశ్రమను ఆదుకుంటామన్నారు.

గత 13 ఏళ్లుగా పాల ఉత్పత్తి దారులు ఇన్సెంటీవ్ కోసం పోరాటం చేసినా పాలకులు పట్టించుకోలేదని పోచారం విమర్శించారు. 75 శాతం సబ్సిడీతో రైతులకు గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. పాలు సేకరిస్తున్న అన్ని గ్రామాలకు మిల్క్ ఎనలైజర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. పాడి పరిశ్రమ డ్వాక్రా మహిళలకు ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పోచారం తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం ద్వారా పాడి పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్తామని పోచారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement